BHNG: జీవాల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఉచిత నట్టల నివారణ కార్యక్రమం గురునాథ్పల్లిలో ఉత్సాహంగా కొనసాగింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ ఆవుల నరసింహ ప్రారంభించి మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.