న్యూ ఇయర్ సందర్భంగా రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ఒడిలో చిన్నారిని పెట్టుకుని దిగిన ఫొటోను ఆమె షేర్ చేసింది. ‘పసిపిల్లలు తమ రెక్కలను దాచుకున్న దేవదూతల్లా ఉంటారు. ఈ చిన్నారి తన ముద్దులొలికే రూపంతో నా మనసును దోచుకున్నాడు’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆ పిల్లాడు ఎవరని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా, ఆ పోస్టుకు ఆమె కామెంట్స్ ఆఫ్ చేయడం గమనార్హం.