BHNG: భూదాన్ పోచంపల్లిలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో 49వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 21 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ సీత సత్యనారాయణ తెలిపారు. 25న శ్రీ భద్రావతి భావన రుషుల కళ్యాణం, 26న పార్వతీ –పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం, 27న శతఘటాభిషేకం, 28న ఘనంగా రథోత్సవం జరుగుతాయని వెల్లడించారు.