ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు. ‘నేనొక ముస్లింని, పాకిస్థాన్ నుంచి వచ్చిన నల్ల జాతీయుడిని. నేను ఆస్ట్రేలియా జట్టులో ఎప్పటికీ ఆడలేనని చాలామంది అన్నారు. కానీ, ఇప్పుడు నన్ను చూసి మీరూ సాధించవచ్చని నమ్ముతున్నా’ అని అన్నాడు.