TG: అసెంబ్లీని బూతులమయం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తాము ప్రొటెస్ట్ చేస్తామంటే మైకు ఇవ్వలేదని, సభలో బీఆర్ఎస్ మాట్లాడొద్దు అంటే తాము ఎందుకు రావాలని ప్రశ్నించారు. BACలో తీసుకున్న నిర్ణయాలు వేరు, అసెంబ్లీలో చెబుతున్నది వేరు అని అన్నారు. సభ నడిపే తీరు అధ్వానంగా ఉందన్నారు. మూసీ ప్రక్షాళనపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని తెలిపారు.