MDCL: మురుగునీటితో నల్లా నీరు కలుషితంగా మారుతున్న పరిస్థితి అనేక ప్రాంతాల్లో ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న పైప్లైన్ వ్యవస్థ కారణంగా, మేడిపల్లి ఓల్డ్ విలేజ్, పంచవటి కాలనీ, గ్రీన్ హిల్స్, బెస్ట్ కాలనీ, సాయి నగర్ కాలనీల్లో ఇదే సమస్య కొనసాగుతోందని చెబుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.