హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత టొమ్మీ లీ జోన్స్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కూతురు, నటి విక్టోరియా జోన్స్(34) అనుమానాస్పదంగా మృతి చెందింది. జనవరి 1న తెల్లవారుజామున శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ లగ్జరీ హోటల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. కాగా, టొమ్మీ, ఆయన మాజీ భార్య కింబర్లీ క్లౌలీల కూతురే విక్టోరియా. ‘మెన్ ఇన్ బ్లాక్ 2’ సినిమాతో పాటు పలు TV సిరీస్‌ల్లో ఆమె నటించింది.