TG: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని BRS నిర్ణయం తీసుకుంది. CM రేవంత్ వ్యాఖ్యలు, స్పీకర్ వైఖరికి నిరసనగా సమావేశాల బహిష్కరించనున్నట్లు హరీష్ రావు తెలిపారు. రేపు తెలంగాణ భవన్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతకుముందు అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.