KRNL: పెద్దకడబూరులో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, ఎంఆర్వో గీతా ప్రియదర్శినితో కలిసి ఇవాళ రైతులకు పుస్తకాలు అందజేశారు. పాసు పుస్తకాలు భూ హక్కులకు భద్రత కల్పించడమే కాకుండా ప్రభుత్వ పథకాలు పొందేందుకు దోహదపడతాయని రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు.