MHBD: మున్సిపాలిటీ పరిధిలో 2026 ఓటర్ల జాబితాను అధికారులు శుక్రవారం వెల్లడించారు. మొత్తం ఓటర్ల సంఖ్య 65,851కు చేరింది. ఇందులో పురుష ఓటర్లు 31,595 మంది, మహిళా ఓటర్లు 34,215 మంది, ఇతరులు 41 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. 2020 ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.