హైదరాబాద్ నగరం నుంచి సులభంగా అవుటర్ రింగ్ రోడ్డును చేరుకునేలా రోడ్ల విస్తరణ, భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.