GNTR: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో ‘హిందూ సమ్మేళనం’ బ్రోచర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఈ నెల 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు తెనాలిలోని చెంచుపేట పద్మావతి కళ్యాణ మండపంలో జరగనుంది. ఈ సమ్మేళనానికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. నిర్వహణ కమిటీ సభ్యులు మంత్రిని కలిసి కార్యక్రమ వివరాలను వెల్లడించారు.