ADB: ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాను మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి నూతన శుభాకాంక్షలు తెలియజేశారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్ బుక్, పెన్నులు కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జలై జాకు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.