SDPT: రాంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బొమ్మ మల్లయ్య ఆధ్వర్యంలో రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రేషన్ షాప్ లేకపోవడం వల్ల గ్రామస్తులు రేషన్ బియ్యం కోసం ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వచ్చేదని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు గ్రామంలోనే రేషన్ బియ్యం పంపిణీ చేయడంతో సమస్య కొంతవరకు తీరిందని అన్నారు.