భారత ప్రధాని మోదీతో అధ్యక్షుడు ట్రంప్‌నకు వ్యక్తిగత విబేధాలు ఉన్నట్లు కనిపిస్తోందని US కాంగ్రెస్ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యం అన్నారు. దానివల్ల ఇరుదేశాల సంబంధాలను ఆయన చెడగొట్టుకుంటున్నారని చెప్పారు. ట్రంప్ సుంకాలతో ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. యుద్ధాలను ముగిస్తామని అధికారంలో వచ్చిన ట్రంప్.. దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.