MDK: నిజాంపేట మండలంలోని చల్మెడ శ్రీ తిరుమల స్వామి ఆలయంలో శుక్రవారం దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, జిల్లా జీపీవో స్వప్న, ఆలయ కమిటీ ఈవో రవికుమార్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో మొత్తం రూ.1,35,866 నగదు సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ రామ్‌రెడ్డి, పూజారి రామ్మోహన్ శర్మ, సర్పంచ్ బొమ్మన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.