TG: కృష్ణా జలాల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని చెప్పారు. బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.