యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై గరికపాటి నరసింహారావు ఘాటుగా స్పందించారు. నేరస్థుడికి శిక్ష కంటే, సమాజం ఛీత్కరించుకున్నప్పుడే నిజమైన మార్పు వస్తుందని హితవు పలికారు. మచ్చలేని వారిపై బురద జల్లడం సరికాదని, ఇలాంటి వాటిని తన అభిమానులు సహించరని స్పష్టం చేశారు. ధర్మానికి మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అసభ్యతపై సమాజం గళం ఎత్తాలని, ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.