NLR: ఉలవపాడులోని సొసైటీ వీధిలో గత రెండు రోజులుగా వ్యర్థాలను తొలగించకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త రహదారిపైకి చేరడంతో దుర్వాసన వ్యాపించడంతో పాటు, పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించడంలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వ్యర్థాలను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.