NGKL: చారకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా తనిఖీ బృందం సందర్శించింది. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యా యుల బోధన తీరు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలును అధికారులు పరిశీలించారు. పాఠశాలలోని మౌలిక వసతులు, రికార్డుల నిర్వహణను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.