కృష్ణా: NH అధికారులతో ఉమ్మడి కృష్ణా జిల్లా MLAలు, MPలు శుక్రవారం సమావేశమయ్యారు. సుమారు రూ.35 వేల కోట్లతో జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి గోశాల వరకు రోడ్డును వెడల్పు చేయడంపై చర్చించినట్టు MP బాలశౌరి వెల్లడించారు. త్వరలో బందరు పోర్టు ప్రారంభం కానుండటంతో పోర్టు అవసరాల కోసం హైవేను ఆరు లైన్లుగా విస్తరించనున్నట్లు చెప్పారు.