NGKL: సీఎం సొంత గ్రామం వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన, ఎక్కడా జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.