VKB: వికారాబాద్ SGFI ఆధ్వర్యంలో తాండూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో తాండూరుకు చెందిన విద్యార్థిని కె. శ్రీలక్ష్మి ప్రతిభ చాటింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు జరిగిన ఈ పోటీల్లో, 9వ తరగతి చదువుతున్న శ్రీలక్ష్మి అండర్-14 విభాగంలో పాల్గొని విశిష్ట ప్రతిభను కనబరిచింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.