RR: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై అనేకమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామేన భీమ్ భరత్ అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట(M) చించల్పేట్ సర్పంచ్ అనసూయ అనంత రాములుతో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు భీమ్ భరత్ సమక్షంలో పార్టీలో చేరారు.