TG: ఉపాధి హామీ పథకంలో కేంద్రం తీసుకొచ్చిన మార్పులను వ్యతిరేకిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఎలాంటి మార్పులు చేయవద్దని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి.. కేంద్రానికి పంపుతామని స్పష్టం చేశారు. ఈ చట్టానికి మహాత్మాగాంధీ పేరును పునరుద్ధరించాలని సభ తీర్మానం చేసిందన్నారు. మహిళా సాధికారిత కోసం పాత చట్టాన్నే కొనసాగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.