GNTR: గుంటూరులో జరిగిన పొగాకు బోర్డు వ్యవస్థాపక దినోత్సవంలో శుక్రవారం ఛైర్మన్ యస్వంత్ కుమార్ మాట్లాడారు. బోర్డు ప్రధానంగా రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ పొగాకుకు గుర్తింపు తీసుకురావడంలో బోర్డు పాత్ర కీలకమని, పొగాకు సాగు రైతులకు సమాజంలో ఆర్థిక గౌరవాన్ని, హుందాతనాన్ని ఇస్తుందని ఆయన కొనియాడారు.