KDP: జాతీయ భద్రతా మాసోత్సవాల జాతీయ గోడ పత్రాలను కలెక్టర్ శ్రీధర్ ఆవిష్కరించారు. శుక్రవారం కడప కలెక్టరేట్లో రెవెన్యూ రోడ్డు భద్రత అధికారుల సమక్షంలో ఆయన పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు నివారించడం, హెల్మెట్ ధరించడం, సీటు బెడ్లు ధరించడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేలా సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.