NLG: మున్సిపాలిటీలలో వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను పునః పరిశీలన చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లతో ఆయన ఇవాళ తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో ఏలాంటి తప్పులు లేకుండా నూటికి నూరు శాతం పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు.