WGL: నల్లబెల్లి(M)రుద్రగూడెంలో బాటను ఆక్రమించి ఒక వ్యక్తి ఇల్లు కడుతున్నాడని ఆరోపిస్తూ భార్యాభర్తలు లింగయ్య, సరోజన నిరసనకు దిగారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు దిగేది లేదని వాదించారు. ఈ విషయం తెలుసుకున్న SI గోవర్ధన్ ఘటనా పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.