KRNL: కోడుమూరు మండలం వర్కూరులో సీపీఐ శతజయంతి ఉత్సవాలను బుడ్తయ్య రాముడు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కార్మికులు, రైతులు, పేదల హక్కుల కోసం సీపీఐ చేసిన పోరాటాలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రాజు, శేషుకుమార్, సులోచనమ్మ తదితరులు పాల్గొన్నారు.