KMR: ఎల్లారెడ్డి పట్టణంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా వాహనదారుల వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు.