పెద్దపల్లి జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్ఐఆర్ నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన, SIR-2002 జాబితాతో SSR-2025 జాబితాను పోల్చి కామన్ పేర్లను మ్యాపింగ్ చేయాలని సూచించారు. ప్రతి గ్రామం, పట్టణ పరిధిలో బూత్ స్థాయిలో మానిటరింగ్ చేయాలన్నారు.