JNG: చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డి కుటుంబాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుక్రవారం పరామర్శించారు. హృతిక్ రెడ్డి మృతిపై సంతాపం తెలిపిన ఎంపీ కుటుంబాన్ని ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జర్మనీ నుంచి మృతదేహాన్ని త్వరగా భారత్కు తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.