AP: దేశంలోని పెట్టుబడుల్లో ఏపీ దూకుడు చూపించిందని మంత్రి లోకేష్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్లోని మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా ఏపీదేనని తెలిపారు. దేశంలోని అగ్రస్థానంలో రాష్ట్రం నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఒడిశా, మహారాష్ట్రలను మించి పారిశ్రామిక వృద్ధి సాధించిందని తెలిపారు. అభివృద్ధిలో ఏపీ ముందుకు దూసుకెళ్తోందని ఉద్ఘాటించారు.