NRPT: జిల్లాలో పీఎం ధన్ ధాన్య కృషి యోజనను సమర్థవంతంగా అమలు చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సహజ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి రైతుల ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని, పంటల వివరాలు తెలుసుకుని పథకం గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.