GNTR: జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా శుక్రవారం పెదకాకాని, వెనిగండ్ల గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించి 100 రోజుల ప్రణాళిక అమలును తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ స్లిప్ టెస్టులు నిర్వహించి, మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని సంబంధిత ఉపాధ్యాయులను ఆదేశించారు. భోజనశాలను సందర్శించి మోను ప్రకారం నాణ్యమైన ఆహారం అందిచాలని తెలిపారు.