NLR: అంగన్వాడీ టీచర్ల సేవలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కావలి నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు ఇవాళ కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 5జీ స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ICDS సీడీపీవో సౌజన్య, అంగన్వాడి అధికారులు, పార్టీ నాయకులతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య చేతులు మీదుగా అందజేశారు.