KNR: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ 66 డివిజన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 6 లోపు నగరపాలక సంస్థ కార్యాలయంలో అందజేయాలని కమిషనర్ ప్రపుల్ దేశాయ్ సూచించారు. ఇందుకోసం పౌర సేవా కేంద్రంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోమన్నారు.