కాకినాడ జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘ ఉద్యోగ విధులు నిర్వర్తించి డిసెంబర్ 31వ తేదీన రిటైర్ అయిన ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను ఎస్పీ బిందు మాధవ్ శుక్రవారం ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అతి త్వరగా ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనా అధికారిని ఆదేశించారు.