VSP: పీఎంపాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలో ట్రాఫిక్ సీఐ సాయి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. హెల్మెట్ ధరించడం, లైసెన్స్ కలిగి ఉండడం, మద్యం సేవించి వాహనం నడపరాదని ఆయన వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సెలింగ్, జరిమానాలు విధించారు.