W.G: మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామం పిప్పళ్లవారి తోట శివారులో జరుగుతున్న పేకాట స్థావరంపై శుక్రవారం పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై జీ.వాసు తెలిపారు. వారి నుంచి రూ.16,270 నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.