TG: బీఆర్ఎస్, బీజేపీలకు సొంత ప్రయోజనాలే తప్ప.. పేదలపై ప్రేమ లేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు ఉండటం తప్పా? అని ప్రశ్నించారు. మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే తప్పా? అని నిలదీశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి రూపాయి పోతే.. తిరిగి 50పైసలే వస్తున్నాయని అన్నారు.