MHBD: ముదిరాజ్ సంఘం జిల్లా నాయకుడు నీలం దుర్గేష్ ఇవాళ గాంధీభవన్లో టీపీసీసీ ఛీప్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.