VSP: మద్దిలపాలెం ఆటోమోటివ్ సమీపంలో ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో వృద్ధురాలు శుక్రవారం తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఆమెను కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.