AP: విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన 36వ పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. బీవీ పట్టాభిరామ్ సాహిత్య వేదికగా ఈ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ ముఖ్యఅతిథిగా వచ్చి ప్రారంభించారు. ఈ మహోత్సవం ఈనెల 12వ తేదీ వరకు కొనసాగుతుంది. రోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉండనుంది.