NGKL: అమ్రాబాద్ మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. నీటి సంపులో పడి జానశ్రీ (2) అనే చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన మండారి రాణి-సైదులు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. శుక్రవారం తల్లి ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా, ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు ఇంటి ముందున్న నీటి సంపులో పడి చనిపోయింది.