W.G: కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై సీఐటీయూ ఆకివీడు మండల శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం ఆకివీడులో సీఐటీయూ ఆల్ఇండియా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మండల కన్వీనర్ తవిటి నాయుడు మాట్లాడుతూ.. గ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారమంతా పడుతుందని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.