SRD: రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కంది మండలం చేర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆంగ్ల ఉపాధ్యాయులు సోమశేఖర్ విద్యార్థుల చేత రోడ్డు ప్రతిజ్ఞ చేయించారు. ప్రధానోపాధ్యాయులు వెంకట రాజయ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.