ATP: జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. అనంతపురం నుంచి రాయదుర్గం వెళ్తుండగా కదరంపల్లి టోల్గేట్ వద్ద ముందున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కనేకల్ మండలం కలేకుర్తికి చెందిన పార్టీ నాయకులు వన్నూరప్ప, లాలెప్పకు స్వల్ప గాయాలయ్యాయి.