SKLM: అంపోలులో కేంద్రమంత్రి రామ్మోహన్ ఇవాళ పర్యటించారు. ఈ మేరకు అధికారులు నిర్వహించిన రీ సర్వే ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా భూ సరిహద్దులపై నెలకొన్న వివాదాలకు కూటమి ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభించిందని అన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.